కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, కుజులు, వృశ్చికంలో శుక్ర, వక్రి బుధులు, ధనస్సులో రవి, శని, మకరంలో కేతువు. 20న శుక్రుడు ధనుర్ ప్రవేశం. వృశ్చిక, ధనస్సు, మకర, కుంభంలలో చంద్రుడు. 23న బుధుడు వక్రత్యాగం.
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు ముందుకు సాగవు. దుబారా ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలబడదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆప్తులను కలుసుకుంటారు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆది, సోమవారాల్లో స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పూర్వ విద్యార్థులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రచయితలు, క్రీడా, కళాకారులకు ప్రోత్సాహకరం.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. నిరుత్సాహం వీడి ముందుకు సాగండి. యత్నాలను విరమించుకోవద్దు. త్వరలో శుభవార్త వింటారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. మంగళ, బుధవారాల్లో పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేసుకుంటారు. భాగస్వామ్యం లాభిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పదవుల స్వీకారానికి అడ్డంకులు తొలగిపోతాయి. ఆది, గురువారాల్లో చాకచక్యంగా వ్యవహరించాలి, తొందరపడి హామీలివ్వవద్దు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఎదుటివారికి అనుకూలిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి కుదుటపడతారు. ఖర్చులు భారమనిపించవు. అయిన వారి కోసం బాగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ పై శకునాల ప్రభావం అధికం. మంగళ, శనివారాల్లో విలువైన వస్తువులు, వాహనం మరమ్మతుకు గురవుతారు. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం చదువుల పట్ల శ్రద్ధ వహించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. గురు, శుక్రవారాల్లో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వేడుకలు, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా పారిశ్రామికవేత్తలు, వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. కార్యసాధనలో జయం, ధనలాభం పొందుతారు. అంచనాలు ఫలిస్తాయి. విమర్శలు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. శనివారం నాడు పనులు మొండిగా పూర్తి చేస్తారు. వాగ్వాదాలు, పంతాలకు పోవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆప్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు స్థానచలనం. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో వుంచుకోండి. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తారు. లైసెన్స్‌లు, పర్మిట్‌ల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సహాయం ఆశించవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించాలి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం అత్యుత్సాహం అదుపుచేయండి. ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, పనిభారం, విశ్రాంతి లోపం. వస్త్ర, ఫ్యాన్సీ, బేకరీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. పెద్దల సలహా పాటించండి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. షాపు పనివారలతో జాగ్రత్త. పెట్టుబడుల వ్య వ్యవహారంలో పునరాలోచన మంచిది. టెండర్లు, ఏజెన్సీలు దక్కకపోవచ్చు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం, నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. ఆర్థికస్థితి సామాన్యం. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. రోజులు భారంగా గడుస్తాయి. ఆది, సోమవారాల్లో ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడటం కష్టమే. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఏ విషయంపై ఆసక్తి పెద్దగా ఉండదు. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. దంపతుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పదవుల స్వీకరణకు అనుకూలం. పెద్దల సంప్రదింపులు జరుపుతారు. మీ నిర్ణయాలను కచ్చితంగా తెలియజేయండి. బాధ్యతలు అప్పగించవద్దు. విమర్శలు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు, నగదు జాగ్రత్త. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. బుధవారం నాడు ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. సంతాన భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో రాణింపు, పురోభివృద్ధి, భాగస్వామిక ఒప్పందాలకు అనుకూలం. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
అంచనాలు ఫలిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. గురు, శుక్రవారాల్లో శకునాలు, వ్యాఖ్యానాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహంలో సందడి నెలకొంటుంది. వేడుకను ఘనంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శనివారం నాడు పనులు మొండిగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహరాలతో తీరిక ఉండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.