శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By ivr
Last Modified: సోమవారం, 23 మే 2016 (22:22 IST)

హనుమంతుడిని మంగళవారం నాడు పూజిస్తే....

మంగళవారం నాడు హనుమంతుడిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. ఆ రోజున చాలామంది భక్తులు హనుమంతుడికి ప్రదక్షిణలు చేస్తుంటారు. స్వామికి సింధూర అభిషేకాలు, ఆకు పూజలు చేయిస్తుంటారు. ఆయనకి ఇష్టమైన వడలు, అప్పాలను నైవేద్యంగా చేయించి సమర్పిస్తుంటారు. ఈ విధంగా చేయడ

మంగళవారం నాడు హనుమంతుడిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. ఆ రోజున చాలామంది భక్తులు హనుమంతుడికి ప్రదక్షిణలు చేస్తుంటారు. స్వామికి సింధూర అభిషేకాలు, ఆకు పూజలు చేయిస్తుంటారు. ఆయనకి ఇష్టమైన వడలు, అప్పాలను నైవేద్యంగా చేయించి సమర్పిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన స్వామి ప్రీతి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. సాధారణంగా శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు, దుస్వప్నాలతో ఇబ్బందులు పడుతున్నవారు హనుమంతుడికి మంగళవారం పూజ చేస్తే రుగ్మతల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
ఇక నవగ్రహ సంబంధిత దోషాలతో ఇబ్బందిపడే వారు మంగళవారం హనుమంతుడిని పూజిస్తే.. ఆశించిన ఫలితాలు చేకూరుతాయి. ప్రతి మంగళవారం హనుమంతుడికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేయడం వలన, పూజాభిషేకాలు జరిపించడం వలన, 'సుందరకాండ' పారాయణ చేయడం వలన, 'హనుమాన్ చాలీసా' చదవడం వలన హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయన ప్రభావం వలన కుజుడు, శనిదేవుడు శాంతించి అనుగ్రహిస్తారని పండితులు అంటున్నారు.