సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 12 మార్చి 2018 (15:51 IST)

ఈ మొక్కలు ఏం చేస్తాయో తెలుసా? చదివితే ఆశ్చర్యపోతారు...

మొక్కలను చాలామంది పీకి అవతల పారేస్తుంటారు. మరికొందరు ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటుంటారు. నిజానికి కొన్ని మొక్కలు మన జీవితాలపై ప్రభావం చూపుతాయని పలు అధ్యాయనాల్లో తేలింది. ఎలాగంటే... మనసు తెలియని ఆలోచనలతో సతమతమవుతున్నా.... అనుకున్న ఉద్యోగాలు దొరుకకపోయినా,

మొక్కలను చాలామంది పీకి అవతల పారేస్తుంటారు. మరికొందరు ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటుంటారు. నిజానికి కొన్ని మొక్కలు మన జీవితాలపై ప్రభావం చూపుతాయని పలు అధ్యాయనాల్లో తేలింది. ఎలాగంటే... మనసు తెలియని ఆలోచనలతో సతమతమవుతున్నా.... అనుకున్న ఉద్యోగాలు దొరుకకపోయినా, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.... ఆర్థికపరంగా ఎదుగుదలలో ఏవైనా అడ్డంకులా.... ఇక దిగులుపడవలసిన అవసరం లేదు. అన్ని బాధలను మర్చిపోండి. మనస్సు ప్రశాంతత కోసం ఎన్నో ప్రయత్నాలు చేసివుంటారు. ఏ రకమైన బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ తగిన పరిష్కారపు మొక్కలు ఇంట్లో పెంచుకున్నట్టయితే మీ కష్టాలు తొలగిపోయి జీవితంలో సంతోషం కలుగుతుందంటున్నారు మన వాస్తు నిపుణులు చెప్తున్నారు.
 
'ప్లోరల్ వెల్ట్ ఆంట్ ది కిలే ష్టోర్ అధికారి ఇక్కడ క్రోటన్స్, ఒకే రోజా, పసుపు అరలీ, వాడామల్లి, అలమండా పువ్వు అనే రకరకాల చెట్లను పెంచడం ద్వారా సమస్యలకు చెక్ పెట్టవచ్చునని వారు సూచిస్తున్నారు. ఒక్కో మొక్క ఒక్కో కష్టం తీర్చే శక్తిని కలిగివుంటుంది.
 
కొన్ని ఉదాహరణలు:
* క్రోటాన్స్ (Crotons)- చెడు ఆలోచనలను తరిమేస్తుంది.
* నందివర్థిని- మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తుంది. 
* తులసి- భక్తిని పెంచుతుంది.
* మందారం- ఉత్సాహకరమైన శక్తిని కలిగిస్తుంది.
* వైట్ గనేరా (White Ghanera)- మనస్సు ప్రశాంతతను పొందుటకు సహాయపడును.
* రెడ్ గనేరా (Red Ghanera)- తప్పులను సరిచేయును.
* ఒపంటియా (opuntia)- కీర్తి, సంపదలను ప్రసాదించును.
* పేపర్ పువ్వు (Bougainvillea)- భగవంతుని పూర్తి ఆదరణలను ఇచ్చును.
* ఆల్‌మందా ఫ్లవర్ (Alamonda flower) - అన్ని అడ్డంకులను తొలగించును. 
* మల్లి పువ్వు (Jasmine) - మరణ భయాన్ని తొలగిస్తుంది. 
* రోజా మొక్క (Rose)ను పెంచడం ద్వారా కోరుకున్న ఉద్యోగము లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.