శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 4 నవంబరు 2016 (17:15 IST)

కార్తీక వనభోజనం... ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి?

ప్రకృతి వనభోజనం కార్తీక మాస పూజా విధుల్లో ముఖ్యమైనది. కార్తీక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచుతుంది. ముక్తికే కాదు సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి దోహదపడుతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయి. వన భోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్ర

ప్రకృతి వనభోజనం కార్తీక మాస పూజా విధుల్లో ముఖ్యమైనది. కార్తీక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచుతుంది. ముక్తికే కాదు సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి దోహదపడుతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయి. వన భోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్రకృతిలో మమేకమై ప్రకృతికి నివేదించే అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం. ఆ తరువాత అందరూ కలిసి వండిన పదార్థాలను దేవునికి నివేదించి ఉసిరిక, అశ్వత్థ, బిల్వ తదితర వృక్షాల నీడలో సామూహింగా భోజనం చేస్తారు. 
 
ఇలా చేయడం వలన ఆ యా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీరారోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది. ఈ ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం, ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రీ వృక్షాల నీడన అరటి ఆకుల్లో కానీ, పనస ఆకుల్లో కానీ పలు వృక్ష జాతులున్న వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భక్తితో భుజిస్తే ఆశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని వేద, పురాణాల వచనం. 
 
ఇలా వనభోజనం చేయడంవల్ల ఆధ్యాత్మిక ఫలితాలు, ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయతానురాగాలు పెంపొంది సామాజిక   సామరస్యతకు, సమైక్యతకు దోహదం చేస్తుంది. ఆనందానికి సంకేతం పచ్చదనం, దాన్ని పంచుకుంటూ ఆనందాన్ని మనసులో నింపుకొంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో, నృత్య గీతాలతో ఆనందంగా గడుపుతారు. వనంలోకి వెళ్ళీ ఆ ఉసిరి చెట్టు కింద, తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి, అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని, ఆ ప్రకృతి అన్రుగహాన్ని, పరమాత్మ అన్రుగహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడాన్ని వన భోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.