గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (17:44 IST)

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ- వేలంలో స్వామి వస్త్రాలు

venkateswara swamy
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలా నిత్యం కళ్యాణం పచ్చ తోరణం మాదిరిగా తిరుమల క్షేత్రం వెలిగిపోతూ ఉంటుంది. తాజాగా శ్రీవారి భక్తులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అది కూడా స్వామి వారి వస్త్రాలను సొంతం చేసుకునే అరుదైన అవకాశం ఇక భక్తులకు లభించనుంది.
 
ఇక స్వామివారికి సంబంధించిన ఏ వస్తువును అయినా పొందేందుకు భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. స్వామి వారి క్యాలెండర్లు, పుస్తకాలు, తీర్థప్రసాదాలు వంటి అనేక శ్రీవారి వస్తువులను పొందేందుకు భక్తులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. తాజాగా శ్రీవారి వస్త్రాల ఈ- వేలానికి సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది టీటీడీ.
 
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు వస్త్రాలను సమర్పింస్తుంటారు. అలా స్వామికి వచ్చే వస్త్రాలను ఏప్రిల్ 15 నుంచి 23వ తేదీ వరకు ఈ వేలం వేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 335 లాట్లు ఉన్నాయని టీటీడీ పేర్కొంది. 
 
ఇక టీటీడీ వేలం వేయనున్న శ్రీవారి వస్త్రాల్లో ఆర్ట్ సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు,  ట‌వ‌ళ్లు, పంచెలు, శాలువ‌లు, హ్యాండ్ క‌ర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళాలు, కార్పెట్లు ఉన్నాయి. 
శ్రీవారికి భక్తులు సమర్పించిన ఈ కానుకలను ఈ నెల 15 నుంచి ఈ- వేలం వేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ వేలంకి సంబంధించి పూర్తి వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ ఆఫీస్‌ను సంప్రదించాలని సూచించింది. లేదా టీటీడీ వెబ్‌సైట్‌‌ను సంప్రదించాల్సి వుంటుంది.