ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (22:21 IST)

తుమ్ముల ఫలితాలు.. ఉదయాన్నే లేవగానే తుమ్మితే..?

sneeze
sneeze
తుమ్ముల ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. ఒక తుమ్ము కీడును సూచించును. ఎక్కువ తుమ్ములు మంచిది కాదు. ఉదయాన్నే లేవగానే తుమ్మినట్లైతే శుభం. పసిపాపలు, శిశువులు, ఐదేళ్ల లోపు వారు తుమ్మితే లాభము, వస్త్రప్రాప్తి. 
 
ఇనుముగాని, వెండినిగాని, పట్టుకొన్నవాడు తుమ్మినట్లైతే కార్యహాని. కంచుగాని, రాగిగాని చేత ధరించినవాడు తుమ్మితే కార్యసిద్ధి. 
 
ఎవరైనా తుమ్మినప్పుడు బంగారం, మొసలి, ఆడవారి నాట్యం, తాంబూలం వేసుకున్న వారి ముఖం చూసినచో ఆ తుమ్ము వలన కలుగు కీడు నశించును. నీటివద్ద పదిమందిలో వున్నప్పుడు తుమ్మినతో అవమానం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.