శుక్రవారం, 12 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (16:53 IST)

తిరుమలలో రద్దీ.. జూన్ 30వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

tirumala
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు అధికంగా తరలివస్తున్నారు. వారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో సుమారు 30-40 గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తోంది. 
 
సామాన్య భక్తులకు త్వరిత గతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఎన్నికలు పూర్తి కావడం, వేసవి సెలవులు కొనసాగుతుండడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. 
 
టీటీడీ రద్దీని గమనిస్తూ.. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. ఈ మూడు రోజులు రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.