శనివారం, 16 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (09:39 IST)

భవీనా పటేల్‌కు భారీ నజరానా : రూ.3 కోట్ల నగదు పురస్కారం

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లోభాగంగా టేబుల్ టెన్నిస్ విభాగంలో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్‌కు గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా రూ.3 కోట్ల నగదు ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
గుజరాత్​ మహేసాణా జిల్లాలోని సుంధియా గ్రామానికి చెందిన భవీనా... పారాలింపిక్స్​లో ఆదివారం జరిగిన క్లాస్‌-4 టేబుల్​ టెన్నిస్​ ఫైనల్​ మ్యాచ్‌​లో చైనా ప్లేయర్​ యింగ్​ ఝోపై 0-3తో ఓడి రజతం సొంతం చేసుకుంది. 
 
పతకం సాధించిన భవీనాను గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభినందించారు. 'మహేసాణా ముద్దుబిడ్డ.. టేబుల్​ టెన్నిస్​లో పతకం సాధించి దేశం గర్వించేలా చేసింది' అంటూ కితాబిచ్చారు. 'దివ్యాంగ్ ఖేల్​ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన' కింద భవీనాకు రూ.3 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.