ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (12:18 IST)

నీరజ్ చోప్రా- మనుబాకర్ ప్రేమలో పడ్డారా? ఆ వీడియో వైరల్

Manu Bhaker- Neeraj Chopra
Manu Bhaker- Neeraj Chopra
భారత స్టార్ ప్లేయర్లు నీరజ్ చోప్రా- మనుబాకర్ ప్రేమలో పడ్డారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ సన్నిహితంగా మాట్లాడే దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంత క్లోజ్‌గా మాట్లాడుతూ.. నీరజ్, మనుబాకర్ కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని టాక్ వస్తోంది. 
 
నీరజ్ చోప్రా, మను బాకర్ ఇద్దరూ సిగ్గులు పోతూ మాట్లాడడం, దీనికితోడు మను తల్లి నీరజ్‌తో మాట్లాడుతూ అతడి చేతిని తన తలపై పెట్టుకుని ఒట్టు తీసుకున్నట్టుగా కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.