ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (13:38 IST)

భారత షూటర్ నమన్‌వీర్‌ సింగ్‌ బ్రార్‌ అనుమానాస్పద మృతి

భారత షూటర్‌ 28 ఏళ్ల నమన్‌వీర్‌ సింగ్‌ బ్రార్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మొహలీలోని సెక్టార్‌ 71లో తన ఇంట్లో నమన్‌వీర్‌ సింగ్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
అయితే నమన్‌ వీర్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా? లేక ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై పోస్టుమార్టం రిపోర్టు నివేదిక స్పష్టత ఇస్తుందని మొహలీ డీఎస్పీ గుర్‌షేర్‌ సింగ్‌ తెలిపారు.
 
కాగా, ఈ ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ షూటింగ్‌ వరల్డ్ కప్‌లో కనీస అర్హత స్కోరు విభాగంలో నమన్వీర్‌సింగ్‌ నాలుగోస్థానంలో నిలిచాడు. అలాగే 2015లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జౌలో జరిగిన వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లో డబుల్‌ ట్రాప్‌ షూటింగ్‌ ఈవెంట్‌లో నమన్‌వీర్‌ కాంస్య పతకం సాధించిన విషయం తెల్సిందే.