శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్

ప్రపంచ అథ్లెట్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్

neeraj chopra
అమెరికాలోని యుజీన్ నగరంలో జరుగుతున్న ప్రపంచ అథ్లెట్స్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత జావెనలి త్రో స్టార్ నీరజ్ చోప్రాకు సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గ్రూపు-ఏ క్వాలిఫికేషన్‌‍ రౌండ్‌లోని తొలి ప్రయత్నంలోనే 88.93 మీటర్ల దూరం విసిరి నేరుగా పురుషుల జావెలిన్ త్రో ఫైనల పోటీలకు అర్హత సాధించిన నీరజ్... నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫలితంగా రజత పతకం వరించింది. 
 
కాగా, ఇటీవల స్టాక్‌హోం కేంద్రంగా జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో 89.44 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించిన నీరజ్ 90 మీటర్ల దూరానికి 6 సెంటీమీటర్ల దూరంలో ఆగిపోయాడు. తాజాగా జరిగిన ఫైనల్ పోటీల 88.13 మీటర్ల దూరం విసిరి సిల్వర్ పతకాన్ని సాధించాడు. అలాగే, 2009 తర్వాత జరిగిన ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు రెండింటినీ గెలుచుకున్న అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు.