సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (13:30 IST)

రెండేళ్ల బ్రేక్ తర్వాత రెండో ఇన్నింగ్స్.. సానియా మీర్జా ఖాతాలో హోబర్ట్ టైటిల్

రెండేళ్ల బ్రేక్ తర్వాత భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ గ్రౌండ్‌లో తన సత్తా చాటింది. తద్వారా తన కలను నెరవేర్చుకుంది. ఎలాగంటే..? హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్‌ను నదియ కిచోనిక్‌తో కలిసి గెలుచుకుంది. దీంతో టెన్నిస్ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా వున్నారు. 
 
వివాహానికి తర్వాత కూడా టెన్నిస్‌ ఆడుతూ వచ్చిన సానియా మీర్జా.. గర్భవతి కావడం.. ఆపై ఓ బాలుడికి జన్మనిచ్చింది. ఆపై బాలుడి బాగోగులు చూసుకుంటూ.. తన ఫిట్‌నెస్‌‍పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పూర్తి ఫిట్ నెస్ సంపాదించిన సానియా మీర్జా.. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే అదరగొడుతూ.. డబ్ల్యూటీఏ హోబర్ట్ ఇంటర్నేషనల్ ట్రోఫీని గెలుచుకుంది. 
 
తన భాగస్వామి నదియా కిచోనెక్‌తో కలిసి అద్భుత ఆటతీరును ప్రదర్శించింది. ప్రపంచ రెండో సీడ్స్ షుయ్ పెంగ్-షుయ్ జాంగ్‌తో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్‌లో శనివారం సానియా మీర్జా జోడీ భారీ షాట్లతో చైనీస్ ప్రత్యర్థి జంటకు చుక్కలు చూపించింది.
 
ఒక గంటా 21 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 6-4, 6-4 పాయింట్ల వరుస సెట్ల తేడాతో సానియా జోడీ విజయభేరి మోగించింది. 33 ఏళ్ల సానియా మీర్జా హోబర్ట్ టైటిల్ నెగ్గడం ద్వారా తన ఖాతాలో 42వ ట్రోఫీని వేసుకుంది.