తేజస్ యుద్ధ విమానానికి కో పైలట్‌గా సింధు.. అరుదైన గౌరవం
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు తేజస్ యుద్ధ విమానంలో విహరించే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఏరో ఇండియా షోలో ఉమెన్స్ డే సందర్భంగా ఏవియేషన్ అధికారులు బ్యాడ్మింటన్ స్టార్‌కు ఈ అవకాశం కల్పించారు.
ఏవియేషన్ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా పలు కార్యక్రమాలను చేపట్టిన ఏరో ఇండియా.. అందులో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో విహరించడం పట్ల పీవీ సిందు హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ, తేజస్ యుద్ధ విమానానికి సింధు కోపైలట్‌గా వ్యవహరించారని చెప్పారు. దీంతో, తేజస్‌కు కోపైలట్‌గా వ్యవహరించిన తొలి మహిళగా సింధు నిలిచింది.