1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (09:58 IST)

స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్ ఏడు, ఎనిమిది అంతస్తుల్లో ఎగసిపడుతున్న మంటలను ఫైర్ ఇంజన్లు అదుపు చేస్తున్నాయి. కాంప్లెక్స్‌లో తొమ్మిది మంది చిక్కుకున్నారు. వారిలో నలుగురిని సహాయక సిబ్బంది రక్షించారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
 
మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పొగతో బాధితులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆక్సిజన్ పంపాలని కోరుతున్నారు. 
 
భవనంపై నుంచి కొందరు వ్యక్తులు తమ ఫోన్‌లలో లైట్ చూపిస్తూ తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా పక్కన వున్న అపార్ట్‌మెంట్స్‌ను రెస్క్యూటీమ్ ఖాళీ చేయిస్తోంది. సాయంత్రం ఏడు గంటల సమయంలో మంటలు చెలరేగాయి.