సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (23:31 IST)

ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చిన అమ్మ అల్లం పద్మ ఇకలేరు

Padma
ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలిగా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు. గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తూనే అప్పట్లో ఉద్యమంలో, ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షులు అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ.
 
ప్రధానంగా ఉస్మానియాలో ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మెస్ లు కూడా మూసేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన సమైక్య పాలకులకు ఆ విద్యార్థుల ఆకలి తీర్చి ధీటైన సమాధానం చెప్పి ఎందరో విద్యార్థులకు ఆకలి తీర్చారు. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు అల్లం పద్మ అంత్యక్రియలు జరుగుతాయి.
 
అమ్మ అస్తమయంతో తెలంగాణ సమాజం విషాదంలో మునిగిపోయింది. తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు