ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (15:16 IST)

సీఎం కేసీఆర్ పార్టీకి తేరుకోలేని షాకిచ్చిన లోక్‌సభ సచివాలయం

brslogo
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితికి లోక్‌సభ సచివాలయం తేరుకోలేని షాకిచ్చింది. లోక్‌సభ బీఏసీ నుంచి ఆ పార్టీ గుర్తింపును రద్దు చేసింది. బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ సచివాలయం గుర్తింపును ఇవ్వలేదు. బీఆర్ఎస్‌ తరపున బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఆ పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వర రావు మాత్రమే ఉన్నారు.

అయితే, బుధవారం జరిగిన లోక్‌సభ బీఏసీకి ఆయన్ను బీఆర్ఎస్ సభ్యుడిగా కూడా కేవలం ఆహ్వానితుడిగానే లోక్‌సభ సచివాలయం ఆహ్వానించింది. నిజానికి ఆరుగురు సభ్యుల కంటే ఎక్కువ మంది లోక్‌సభ సభ్యులు ఉన్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఉంటుంది. అయితే, తెరాసకు తొమ్మిది మంది సభ్యులు ఉన్నప్పటికీ ఆ పార్టీకి బీఏసీ సభ్యత్వాన్ని ఇచ్చేందుకు లోక్‌సభ సచివాలయం నిరాకరించింది.

దీంతో ఆ పార్టీ ఇకపై కేవలం ఆహ్వానిత పార్టీగానే ఉండనుంది. అంటే, లోక్‌సభ సచివాలయం ఆహ్వానిస్తేనే బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ సభ్యుడు హాజరుకావాల్సి వుంటుంది.