మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (08:53 IST)

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

telangana
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ వంటి కొన్ని జిల్లాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల విషయంలో రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. కొన్ని జిల్లాల్లో వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
గత రెండు వారాలుగా, పైన పేర్కొన్న మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో COVID-19 కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.5శాతం నుండి 2శాతానికి పెరిగింది. ప్రస్తుతం, ఈ జిల్లాల్లోని ప్రతి వంద మందిలో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.