శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (14:10 IST)

తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ... రైతులు అప్రమత్తంగా ఉండాలి...

rain
ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు, అకాల వర్షాలు కుమ్మిపోస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల ఉరములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
 
ముఖ్యంగా, ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మూడు జిల్లాలకు వాతావణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30-40 కిలోటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
అటు ఏపీలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు తప్ప మిగిలిన చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. వర్షాలు సమయంలో బయటకు వెళ్లద్దని అధికారులు సూచించారు. అకాల వర్షాలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులకు వాతావరణ షాక్‌కు గురిచేసింది.