ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (10:38 IST)

హైదరాబాద్ నగరంలో దారుణం: నగ్నంగా డ్యాన్సర్‌ మృతదేహం..

హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగ్నంగా.. ఉన్న ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. ఫలక్‌ నుమా పరిధిలో అనుమాస్పద స్థితి లో ఓ డాన్సర్‌ మృతి చెందింది. ఒంటిపై బట్టలు లేకుండా యువతి మృత దేహం నగ్నంగా పడేశారు కొందరు దుండగులు.
 
అయితే ఆ యువతి మృత దేహాన్ని చూసిన  స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ యువతిది అత్యాచారమా ? లేక సామూహిక అత్యాచారమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
యువతి పోన్ కాల్ డేటా ఆధారంగా మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువతిని డ్యాన్సర్‌గా పోలీసులు గుర్తించారు. అలాగే ఆ యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి… ఈ కేసుపై ముందుకు వెళుతున్నారు.