గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (13:46 IST)

రంగారెడ్డి జిల్లాలో యువ ఇంజినీర్ ఉరేసుకుని ఆత్మహత్య

suicide
రంగారెడ్డి జిల్లాలో ఓ యువ ఇంజినీర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు తానే కారణమని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
గుర్రంగూడ బాపిరెడ్డి కాలనీకి చెందిన శివకృష్ణ (27) నారాయణఖేడ్‌లో మిషన్ భగీరథ పథకం ఏఈగా పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవలే ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 13న నారాయణఖేడ్ నుంచి ఇంటికి వచ్చిన శివకృష్ణ నైలాన్ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
అయితే, రెండు రోజుల తర్వాత శివకృష్ణకు తండ్రి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో పెద్ద కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడు గుర్రంగూడలోని తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికెళ్లి చూడమని చెప్పాడు. సోమవారం రాత్రి అతడు ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. 
 
వారొచ్చి తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. గదిలో శివకృష్ణ ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతడి దుస్తుల్లో కనిపించిన సూసైడ్‌ నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని, తనకు తానే కారణమని పేర్కొన్నాడు. 
 
పెళ్లి ఇష్టం లేక అతడు ఈ పనికి పాల్పడినట్టు శివకృష్ణ తండ్రి పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.