గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (17:11 IST)

కరీంనగర్‌ జిల్లాలో వింత వ్యాధి: భారీగా నాటుకోళ్లు మృత్యువాత

కరీంనగర్‌ జిల్లాలో వింత వ్యాధి ప్రజలను కలవరపెడుతోంది. చిగురుమామిడి మండలం నవాబ్‌పేటలో భారీగా నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కళేబరాలను గ్రామశివారులో పూడ్చి పెట్టాడు యజమాని. కోళ్ల మృతితో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఇప్పటికైనా కోళ్ల మృతికి గల కారణాలను అన్వేషించాలని కోరాడు. 
 
అయితే.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. బర్డ్‌ ఫ్లూ అంటూ భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు చనిపోయిన కోళ్లను పరిశీలించిన పశు వైద్యాధికారులు.. బర్డ్‌ ఫ్లూ కాదని చెబుతున్నారు.
 
వికారాబాద్‌ జిల్లాలోనూ ఇదే ఘటన వెలుగుచూసింది. దారూర్‌ మండలం దోర్నాల్‌లో గత 4 రోజులుగా వందల సంఖ్యలో కోళ్లు, కాకులు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్లు, కాకుల మృతిపై పశుసంవర్ధకశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.