ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జనవరి 2022 (15:18 IST)

హైదరాబాదులో పెను ప్రమాదం: కారు పల్టీ కొడుతూ..?

హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రకేసరి నగర్‌లో అర్థరాత్రి ఓ కారు పల్టీలు కొడుతూ అపార్ట్‌మెంట్ గోడను ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న యువకులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. న్యూ ఇయర్ కేకుతో కారులో వెళుతుతుండగా ప్రమాదం జరిగింది.
 
మద్యం మత్తులో యువకులు డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కొద్ది నిముషాల ముందే మహిళలు, చిన్నారులు అపార్ట్‌మెంట్‌ లోపలికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. అక్కడి సీసీ కెమెరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.