1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (16:23 IST)

ఓరి దేవుడా హీరోకు కోవిడ్ సోకింది

Vishwak sen
ఫ‌ల‌క్‌నామాదాస్‌, పాగ‌ల్‌, హిట్ చిత్రాల క‌థానాయ‌కుడు విశ్వ‌క్‌సేన్ కు కోవిడ్ సోకింది. ఇప్ప‌టికే రెండు వేక్సిన్‌లు వేసుకున్నా తాను కోవిడ్ బారిన ప‌డిన‌ట్లు విశ్వ‌క్‌సేన్ తెలియ‌జేస్తున్నాడు. సోష‌ల్‌మీడియాలో దాని గురించి చెబుతూ, డాక్ట‌ర్ల స‌ల‌హామేర‌కు ఐసొలేష‌న్‌లో వుంటున్నాను. మీరు జాగ్ర‌త్త‌గా వుండండి. మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించండి అంటూ అభిమానులకు తెలియ‌జేస్తున్నారు.
 
ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డిన ప‌లువురికి ఆయ‌న స్వ‌చ్చంధంగా స‌హాకారాలు అందించారు. స‌రుకులు, ఇత‌ర‌త్రా సౌక‌ర్యాలతో సేవ చేశారు. ఆయ‌న తాజాగా న‌టిస్తున్న సినిమా ఓరి దేవుడా. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు. సంక్రాంతి సంద‌ర్భంగా దాని వివ‌రాలు తెలియ‌నున్నారు. విశ్వ‌క్ తెలుపుతూ, ఏడాది చివ‌రిరోజు తాను ఐసొలేష‌న్‌లో వున్నాన‌నీ, కొత్త ఏడాదిలో కోలుకుంటాన‌ని చెబుతూ, అంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకుని ఇంటిలోనే వేడుకలు చేసుకోండ‌ని పిలుపు ఇచ్చారు.