గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (08:46 IST)

లంచం అడిగిందని నిలదీస్తే... చెప్పుతో దాడి..

లంచం అడిగి.. ఆపై చెప్పుతో దాడిచేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారినిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

లంచం అడిగిందని నిలదీస్తే ఇంటి వద్దే... నాపై చెప్పుతో దాడి చేసిన అధికారిని శిక్షించాలని బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నిర్మాణంలో కంటోన్మెంట్ బోర్డ్ అధికారిని వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరారు.

పికెట్​కు చెందిన రామ్​రెడ్డి లాల్ బజార్​ విద్యుత్ శాఖలో లైన్​మెన్​గా పనిచేస్తున్నాడు. తన వంద గజాల ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం ఇవ్వాలని లేదంటే... అడ్డుకుంటామని కంటోన్మెంట్ బోర్డ్​లో సర్వేయర్ పనిచేస్తున్న సరిత వేధించిందన్నారు.

లంచం అడిగిందని నిలదీస్తే ఇంటివద్ద ఆ అధికారి నా పై చెప్పుతో దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మారేడుపల్లి పోలీసు స్టేషన్​లో కేసు పెట్టినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా... తనపైనే అక్రమ కేసును నమోదు చేశారని పేర్కొన్నారు.

కంటోన్మెంట్ అధికారుల నుండి రక్షణ కల్పించి.. దాడి చేసిన అధికారినిపై చర్యలు తీసుకోవాలని భాదితుడు మానవ హక్కుల కమిషన్​ను వేడుకున్నారు.