మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (11:53 IST)

ఏపీకి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డే.. ఇందులో ఎలాంటి మార్పు లేదు: నాయిని

తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఏడాది రానున్న ఎన్నికల్లో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి గెలిచి.. సీఎం పీఠంపై కూర్చుంటారన్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీకి చిరునామా గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని తెలిపారు. 
 
కేసీఆర్‌ను ఓడించడం ఎవరితరమూ కాదన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలతో టీఆర్ఎస్‌ను పోల్చి చూస్తే.. ఎవరు బాగా పాలించారో తెలుస్తుందని చెప్పారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని నాయిని గుర్తు చేశారు.
 
ఇదిలా ఉంటే... తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఆ రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రచారం స్పీడ్ పెంచారు. ఏకంగా ఎనిమిది సభల్లో బుధవారం పాల్గొననున్నారు. జాన్సువాడ, జుక్కల్, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి ఆందోల్, నర్సాపూర్ సభల్లో ప్రసంగించనున్నారు. ఆపై సాయంత్రం తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.