కాషాయ కండువా కప్పుకోనున్న జయసుధ?
సినీ నటి, మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2009లో గెలుపొందిన జయసుధ, 2014లో జయసుధ ఓడిపోయారు. జయసుధ గత కొంతకాలంగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇప్పటికే కన్వీనర్ ఈటల రాజేందర్‌తో చర్చలు జరిగాయి. బీజేపీలో చేరేందుకు జయసుధ సుముఖత వ్యక్తం చేశారు. ఈనెల 21న బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ ఆహ్వానించారు. జయసుధ గతంలో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ నెల 21 అమిత్ షా తెలంగాణలోని మునుగోడులో పర్యటించనున్నారు. ఈ పర్యటన సమయంలో అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం.