శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (13:36 IST)

జోగిని శ్యామలకు వేధింపులు... ఆ వీడియోలు పంపడంతో..?

హైదరాబాద్‌లో బోనాల పండుగ జరిగితే అక్కడ జోగిని శ్యామల దర్శనమిస్తారు. కానీ తాజాగా జోగిని శ్యామలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ మహిళ.. జోగిని శ్యామలకు చెందిన అసభ్యకరమైన వీడియోలు పంపి వేధింపులకు గురిచేసింది. దీంతో జోగిని శ్యామల.. తాజాగా సిటీ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ కు చెందిన మౌనిక, జోగిని శ్యామలకు మంచి స్నేహితురాలు. అయితే.. భర్తతో గొడవ పడి జోగిని శ్యామల వద్దకు మౌనిక వచ్చింది. కానీ ఈ విషయంలో మౌనిక భర్తకు మద్దతుగా నిలిచింది జోగిని శ్యామల. దీంతో ఆగ్రహానికి గురైన మౌనిక, శ్యామల ఇంటి ముందు రచ్చ చేసింది.
 
అక్కడితో ఆగకుండా.. జోగిని శ్యామలకు చెందిన వ్యక్తిగత వీడియోలు ఆమెకు పంపుతూ.. టార్చర్‌ పెట్టింది మౌనిక. దీంతో సిటీ సైబర్‌ పోలీసులకు జోగిని శ్యామల ఫిర్యాదు చేసింది. 
 
శ్యామల ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్‌ సందేశాలను మౌనిక పంపిస్తున్నారు. వాటిలో శ్యామలతో పాటు ఆమె కుటుంబాన్నీ కించపరిచే, అవమానించేలా అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని పోలీసులకు తెలియజేసింది.