శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (18:35 IST)

కేసీఆర్ విజన్ దేశానికే ఆదర్శం.. మంత్రి జగదీష్ రెడ్డి

మొక్కల పెంపకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మొక్కల పెంపకమే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా ఆత్మకూర్ (యస్)మండల పరిధిలో నీ నెమ్మికల్ గ్రామంలో నీటి ప్రాచుర్యం కార్యక్రమానికి సంబంధించిన జలశక్తి అభియాన్ కిసాన్ మేళాను ఆయన ప్రారంభించారు. 
 
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ,జిల్లా వ్యవసాయ శాఖలతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలు సూర్యపేట జిల్లా గడ్డిపల్లి గ్రామంలో నీ కృషివిజ్ఞాన కేంద్రం సౌజన్యంతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని హరిత వనంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పడుతున్న శ్రమ అచంద్రార్కం నిలిచి పోతుందన్నారు.

నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఏకకాలంలో లక్షమొక్కలు నాటడమే కాకుండా గుండ్రాంపల్లి వద్ద స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటి ప్రారంభించిన హరితహారం రాష్ట్రంలో ఓ యజ్ఞంలా సాగుతుందని ఆయన కొనియాడారు. 
 
నీటి సంరక్షణ ను మొక్కల పెంపకాన్ని వేరువేరుగా చూడలేమన్నారు. మొక్కలు నాటితే ఏపుగా పెరిగే చెట్ల నుండే వర్షపుదారలు కారి పంటలు సస్యశ్యామలం కావడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సులభతరమౌతుందన్నారు.
 ఒక్క జాతీయ రహదారిపై మొక్కలు నాటితేనే సరిపోదని మారుమూల ప్రాంతాలకు సైతం మొక్కలు నాటి అడవులను పెంచగలిగినప్పుడు మాత్రమే భవిష్యత్ తరాలకు మనం ఆక్సిజన్ అందించగలుగు తామన్నారు. 
 
తెలంగాణా ప్రాంతంలో అంతరించిపోతున్న అడవులను చూసి ఈ ప్రాంతం ఎడారిగా మరబోతుందంటూ ఇక్కడి పర్యావరణం నాశనం అవుతుందంటూ ఇక్కడ మొక్కలు నాటేందుకు విద్యావంతులు ఆతృతగా ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. 
 
అడవుల పెంపకంలో సరిహద్దుల్ని చేరిపేసుకుంటు పరిశోధనలు చేస్తున్న శాస్త్ర వేత్తలను ఆయన అభినందించారు.వచ్చిన నీటిని ఒడిసి పట్టుకునే పద్ధతులను వివరించేందుకు గాను కృషి విజ్ఞాన కేంద్రం వంటి సంస్థలు చేస్తున్న పరిశోధనలలో యావత్ రైతాంగం భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆ సంస్థలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు రైతులకు అర్ధమయ్యే భాషలో అర్థవంతంగా వివరిస్తూ నీటి సం రక్షణ ప్రాచుర్యాన్ని వివరిస్తూన్న తీరు అబ్బుర పరుస్తుందాన్నారు. 
 
స్వరాష్ట్రంలో సుపారిపాలన లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సుభిక్షంగా ఉంటున్నామన్నారు. తెలంగాణా ఏర్పడే నాటికి ఉన్న పంట దిగుబడులు ఇప్పుడు రెండు వేల శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. 
 
ఇంజినీర్ అవతారమెత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సకాలంలో పూర్తి చేయడం అల్ టైం రికార్డు గా ఆయన అభివర్ణించారు. దీనితో తెలంగాణా రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల భూమి స్థిరీకరణ జరుగబోతుందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
 
ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.