టీడీపీ నేత నారా లోకేశ్ ప్రధాన అనుచరుడు దుర్మరణం
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత దుర్మరణం పాలయ్యారు. ఈయన పేరు రాజవర్థన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్నారు.
గద్వాల జిల్లా పరిధిలోని ఉండవెల్లి సమీపంలో ఇటిక్యాలపాడు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రాజవర్థన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఇటిక్యాలపాడు వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రాజవర్థన్ రెడ్డి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.