సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (09:40 IST)

డ్రగ్స్ దందాలో కీలక పరిణామం : మరో వ్యాపారవేత్త అరెస్టు

హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ డ్రగ్స్ దందాలో అనేక మంది వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అనేక మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ ప్లెడ్డర్స్‌తో సంబంధాలు ఉన్నట్టు తెలంగాణ పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. 
 
ఈ నేపథ్యంలో ముుంబై పోలీసులు వ్యాపారవేత్త గజేంద్ర ఫారెక్‌ను అరెస్టు చేసారు ఆటో మొబైల్ రంగంలో మోసాలకు పాల్పడిన గజేంద్ర.. ముంబైలో అనేక మంది వద్ద కోట్లాది రూపాయల మేరకు మోసం చేసినట్టు సమాచారం. పైగా, ముంబై పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నట్టు సమాచారం. 
 
ఈ క్రమంలో గజేంద్రంను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయనకు హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో కూడా సంబంధం ఉంది. దీంతో గజేంద్ర కోసం హైదరాబాద్ నగర పోలీసులు గత కొన్న రోజులుగా ముమ్మరంగా గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ముంబై పోలీసులకు చిక్కడం గమనార్హం.