సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (11:48 IST)

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్.. ఉరుములు, మెరుపులు

Rains
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. నాలుగు రోజుల పాటు వానలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆది, సోమ, మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 
 
ఒక వైపు ఎండలు మండిస్తుంటే.. తాజాగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షం కురవనుంది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రం మట్టం నుంచి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో నైరుతి దిశ నుంచి గంటకు 4 నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం వుంది.