బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (09:54 IST)

అమితాబ్ బచ్చన్‌ బంధువులను మోసం చేసిన సంధ్య కన్వెన్షన్ ఎండీ.. అరెస్టు

arrested
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసిన కేసులో హైదరాబాద్ నగరానికి చెందిన సంధ్య కన్వెన్షన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం భాగ్యనగరికి వచ్చిన పోలీసులు.. శ్రీధర్‌ను ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. కాగా, శ్రీధర్‌పై ఇప్పటికే అనేక రకాలైన మోసం కేసులు ఉన్నాయి. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఓ సివిల్ కేసు వ్యవహారాల్లో తమ వద్ద రూ.250 కోట్ల మేరకు మోసం చేశారంటూ శ్రీధర్‍పై ఢిల్లీ పోలీసులకు అమితాబ్ బచ్చన్ బంధువులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఈ విచారణలో శ్రీధర్ మోసం చేసినట్టు నిర్ధారించారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు అయితే శ్రీధర్ అరెస్టు విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినప్పటికీ బహిర్గతమైంది.