గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (18:48 IST)

హైటెక్ సిటీ సమీపంలో రైలు ప్రమాదం.. - ముగ్గురు స్పాట్ డెడ్

mmts train
హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ సమీపంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ట్రాక్‌పైకి వచ్చిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైటెక్ సిటీ సమీపంలోని మూల మలుపు వద్ద ఎంఎంటీఎస్ రైలును గమనించకుండా ముగ్గురు వ్యక్తులు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేగంగా దూసుకొచ్చిన రైలు వారిపై దూసుకెళ్లింది. 
 
దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రాజప్ప, శ్రీను, కృష్ణలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపతున్నారు.