1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (13:15 IST)

తెలంగాణ వైద్యులకు షాక్: డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు

Doctors
తెలంగాణ వైద్యులకు షాక్ ఇచ్చింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులయ్యే వైద్యులకు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
 
నాన్‌ టీచింగ్‌ విభాగం నుంచి టీచింగ్‌ విభాగంలోకి బదిలీ ద్వారా వచ్చేవారు సైతం ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.  
 
ఇది వైద్య విద్య సంచాలకుడి విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి నిబంధన వర్తించదని పేర్కొంది. అంటే కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు.. ఇకపై ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయడానికి వీల్లేదు. 
 
ఈ మేరకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ నిబంధనలను సవరించింది ప్రభుత్వం. క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి కనీస అర్హతలను తాజా ఉత్తర్వుల్లో నిర్ధారించింది. అందరు స్పెషలిస్టులు, డాక్టర్లు కచ్చితంగా తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.
 
రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపట్టింది. ఈ తరుణంలో నియామక మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్‌ రద్దు అంశం కీలకంగా మారింది.