గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (13:54 IST)

15 నుంచి తెలంగాణా రాష్ట్రంలో ఒంటిపూట బడులు

schools
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేసింది. ఈ యేడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు మండిపోతున్న విషయం తెల్సిందే. దీంతో ప్రభుత్వం ముందుగానే ఒంటిపూట బడులు పెట్టేందుకు మొగ్గు చూపింది. 
 
విద్యాశాఖ ఆదేశాలతో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం బడుల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం అందజేయాలని సూచించింది. 
 
మరోవైపు, పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల దృష్ట్యా వారికి మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని తెలిపింది. పదో తరగతి పరీక్షలు జరిగే బడుల్లో మాత్రం ఒంటిపూట బడులు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా, ఏప్రిల్ 3వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.