గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (13:24 IST)

జెన్ కోలో ఉద్యోగాలు: నోటిఫికేషన్ విడుదల

Jobs
తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్ కో తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
 
బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సంస్థలో మొత్తం 339 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్న తెలిపింది.
 
అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు కూడా రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు గడువు ఈ నెల 29 కాగా డిసెంబర్ 3న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు జెన్ కో తెలిపింది.