1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (14:22 IST)

ఇత్తడి పాత్రలో బాలుడు..తల మాత్రమే పైన.. శరీరమంతా....

ఇత్తడి పాత్రలో బాలుడు చిక్కుకుపోయాడు. ఆడుకుంటూ ఇత్తడి పాత్రలో ఇరుక్కుపోయాడు. చివరకు ఇత్తడి పాత్రను కట్ చేసి బాలుడిని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో  నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తల్లిదండ్రులు తమ పనిలో ఉండగా ఆ పక్కనే ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఇత్తడి పాత్రలోకి దిగాడు. తల భాగం మాత్రమే పైకి ఉంది. మిగతా శరీరం మొత్తం అందులోనే ఉంది. 
 
బయటకు రాలేక చాలా  సేపు ఏడుపు లగించుకున్నాడు. చివరికి వెల్డింగ్ మిషన్ తో బాలుడిని బయటకు తీశారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు స్పష్టం చేశారు.