గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (09:54 IST)

అక్రమ సంబంధం వద్దన్నాడనీ... భర్తను ఎలా చంపిందో చూడండి

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో సొంత భర్తనే ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది.
 
బిహార్‌ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్‌ జా ఉపాధి కోసం నగరానికి వచ్చి ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తా రాజ్‌నగర్‌లో భార్యా, పిల్లలతో కలిసి బతుకుతున్నాడు. ఈ క్రమంలో ఖైరతాబాద్‌లో ఓ జ్యూస్ పాయింట్ ప్రారంభించాడు.

ఇందులో పనిచేసేందుకు వారికి దూరపు బంధువైన లాల్‌బాబును నియమించాడు. అయితే లక్ష్మణ్‌ జా భార్య కుష్బుదేవికి, బంధువైన లాల్‌బాబుకు సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

విషయం తెలుసుకున్న లక్ష్మణ్‌ హెచ్చరించినా వీరు ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో తమ బంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించి ఈనెల 14న రాత్రి లక్ష్మణ్‌జా నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలిసి మెడకు చున్నీ బిగించి చంపేసింది.

మరుసటిరోజు ఉదయం భర్త సోదరుడు బిహారి జాకు ఫోన్‌ చేసి విషయం చెప్పి సహజ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించింది.

సోదరుడి మృతిపై అనుమానంతో బిహారి జా పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయాలు బయటికి వచ్చాయి. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.