శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (13:43 IST)

"గేమ్ ఛేంజర్"లో పవన్ కల్యాణ్ తరహా రోల్..

Pawan kalyan
ప్రముఖ ఎస్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం "గేమ్ ఛేంజర్" రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించుకుంటుంది.ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
తాజాగా ఆ పాత్ర గురించిన వివరాలు బయటకు వచ్చాయి. గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ 2019లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అధికారిగా పనిచేస్తున్న రామ్ నందన్ పాత్రను పోషిస్తున్నాడు. ఇంకా ఈ చిత్రంలో నిజాయితీ గల రాజకీయ నాయకుడి కల్పిత పాత్ర ఉందని టాక్. 
 
ఈ పాత్రలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరహాలో ఓ రోల్ వుంటుందని సమాచారం. ఈ నిజాయితీ గల రాజకీయ నాయకుడి కల్పిత పాత్ర పవర్‌స్టార్‌కు కీర్తిని ఇస్తుంది.
 
 రామ్ చరణ్-శంకర్ ద్వయం ఇప్పటికే విపరీతమైన హైప్‌ని సృష్టించింది. ఇక ట్రైలర్ విడుదలైన తర్వాత “గేమ్ ఛేంజర్” రాబోయే రోజుల్లో మరింత సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది.