సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (23:07 IST)

విహారికకు ఐ లవ్ యూ చెప్పిన హైపర్ ఆది!

hyper aadi
రైటర్‌గా మొదలై ఆ తర్వాత జబర్దస్త్ షోతో ఫేమస్ కమెడియన్‌గా మారిన హైపర్ ఆది ఇప్పుడు సినిమాలు, టీవీ షోలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. యాంకర్ వర్షిణితో ప్రేమలో ఉన్నాడని, పెళ్లి చేసుకుంటానని కొందరు తెలిపారు. 
 
అయితే ఈ కథనాలు నిజం కాదని వర్షిణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. తాను ఎవరినీ ప్రేమించడం లేదని, తాను, హైపర్ ఆది కేవలం స్నేహితులమేనని చెప్పింది. 
 
అయితే తాజాగా మరో కొత్త విషయం చోటుచేసుకుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే టీవీ షోలో విహారిక అనే అమ్మాయిని పరిచయం చేశాడు హైపర్ ఆది. 
 
ఆమెపై తన నిజమైన ప్రేమ అని, "ఐ లవ్ యు" అని కూడా చెప్పారు. విహారిక కూడా అతనికి తిరిగి "ఐ లవ్ యు" అని చెప్పింది. షో నుండి ఈ క్షణం ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది.