సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (13:49 IST)

మళ్ళీ వెండితెరపై పవర్ స్టార్.. ఆ బ్యానర్లో సినిమా..

నిన్నటి వరకు ఎన్నికల హడావిడి. రిజల్ట్స్ ఇవిఎంలలో భద్రంగా ఉంది. ఎవరు గెలిచేది తెలిసేది నెలకు పైగా టైం ఉంది. అయితే కొత్త చర్చ అప్పుడే మొదలైంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడా..లేదా అని. ఒకవేళ నటిస్తే ఎవరి డైరెక్షన్లో నటిస్తాడు. ఇంతకీ పవర్ స్టార్ ఆలోచన ఏంటి? 
 
ఇక ఈ జీవితం రాజకీయాలకే అంకితమని పవన్ కళ్యాణ్ ఓ సంధర్బంలో అన్నా ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్న నిర్ణయానికి పవన్ వచ్చేశారట. గతంలో చిరంజీవి ఇలాగే యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పేసినా మళ్లీ కెమెరా ముందుకు వచ్చి రాజకీయాలకు దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందన్న గ్యారంటీ లేకపోయినా పరిస్థితులు చూస్తుంటే పవన్ మరోసారి కెమెరా ముందుకు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ మరోసారి నటించి తీరాల్సిందే.
 
లేదంటే ఇచ్చిన మాట అటకెక్కినట్లే. పవన్ కళ్యాణ్ నటించి యేడాది దాటింది. 2018 సంవత్సరంలో సంక్రాంతికి వచ్చిన అజ్ఞాతవాసి సినిమా పెద్దగా ఆడకపోగా ఆ తరువాత పవన్ పాలిటిక్స్‌లో బిజీ అయిపోయారు. అయితే అప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడు పవన్. తీసుకున్నఅడ్వాన్స్‌ను నిర్మాతలు తీసుకోకుండా ఎన్నికల తరువాత సినిమా చేసి పెట్టమన్నారు. ఈ లెక్కన పవన్ నటించే సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు ఎస్ఆర్‌టి బ్యానర్స్‌లో నటిస్తానని మాట ఇచ్చాడట పవన్.
 
పవన్ కళ్యాణ్‌కు ఆప్తుడైన రామ్ ఎస్ఆర్ టిబ్యానర్ పైన చుట్టాలమ్మాయి, నేల టిక్కెట్టు సినిమాలను నిర్మించాడు. నేల టిక్కెట్టు ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. సినిమా చేద్దామని రామ్ తండూరికి అప్పుడూ పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారట. దీంతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చేది లేనిదన్నది ఫలితాల విడుదల తరువాత నిర్ణయం తీసుకుంటానని పవన్ చెప్పారట.

రాజకీయాల్లో కీ-రోల్ సోషించాల్సి వస్తే సినిమాల ఊసే ఉండదని, ఒకవేళ జనసేన ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడితే నటించే అవకాశం ఉంటుందని చెబుతున్నారట పవన్. అయితే వీరిద్దరిలో ఏ బ్యానర్‌కు పవన్ ఛాన్స్ ఇస్తారన్నది ఆసక్తిగా మారుతోంది.