మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (17:55 IST)

ఎన్టీఆర్ ఫేస్ ఇల్యూజన్ టూల్ వైరల్ గా మారాయి

NTR Face Illusion
NTR Face Illusion
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ  దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా అప్డేట్ లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇటీవల సముద్రపు దొంగలు టీం యాక్షన్ ఎపిసోడ్ అరేబియా సముద్రం పరిసరాల్లో చేస్తున్నట్లు దేవర టీం తెలియజేసింది. ఇందుకు హాలీవుడ్ సిబ్బంది కూడా పనిచేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఎన్టీఆర్ అభిమాని ఓ లుక్ విడుదల చేసాడు. 
 
తను ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ మోహన్ అయిన ఈయన రెండు ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్లేయింగ్ విత్ ఏఐ ఇల్యూజన్ టూల్ అంటూ ఎన్టీఆర్ ఫేస్ ను క్రియేట్ చేశారు. ఫొటోలో సముద్రతీరం, పడవలు, సూర్యస్తమం ఉండగా వాటిని గమనిస్తే ఎన్టీఆర్ ఫేస్ కనిపిస్తుంది. ఇక అభిమానులు ఊరుకుంటారా వారికి పండగే.. అందుకే  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి.