శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (20:33 IST)

ప్ర‌భాస్ వివాహం విదేశాల్లో అట‌!

Prabhas-1
రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ న‌ల‌భై ఏళ్ళు దాటాయి. ఇంకా పెళ్లి చేసుకోడా అంటూ ఫ్యాన్స్‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్యే. విజ‌య‌వాడ‌లో ఓ వీరాభిమాని వున్నాడు. కృష్ణంరాజు హీరోగా నుంచి ఆయ‌న అభిమానే. ఇప్పుడు ప్ర‌భాస్ అభిమాని అయ్యాడు. హైద‌రాబాద్‌లో ప్ర‌భాస్ సినిమాకు సంబంధించిన ఫంక్ష‌న్ జ‌రిగినా వెంట‌నే హాజ‌ర‌వుతాడు. అయితే పెళ్లి విష‌యంలో మాత్రం త్వ‌ర‌లో బాజాలు మోగ‌నున్నాయ‌ని అవి కూడా విదేశాల్లో జ‌రుగుతాయ‌ని అంటున్నాడు. ఇంత‌వ‌ర‌కు ప్ర‌భాస్ వివాహం గురించి ఆయ‌న పెద్ద‌నాన్న కూడా బాహుబ‌లి త‌ర్వాత అని అప్ప‌ట్లో స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత సాహోతో రెండేళ్ళు గ‌డిచిపోయాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం ముంబైలో సొంత ఇల్లు కొనుక్కున్న ప్ర‌భాస్ ఓ ఇంటివాడు అయ్యే అవ‌కాశాలు మెండుగా క‌న్పిస్తున్నాయి. అక్క‌డే ఎక్క‌వ స‌మ‌యం కేటాయిస్తున్న ప్ర‌భాస్ హైద‌రాబాద్‌లో వుండేది త‌క్కువ స‌మ‌య‌ట‌. గ‌తంలో అనుష్క‌తోనూ, మ‌రో రాజ‌కీయ‌నాయ‌కురాలితోనూ మంచి సంబంధాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు వాటికి పుల్‌స్టాప్ పెట్టాలంటే ప్ర‌భాస్ నుంచి మంచి వార్త రానున్న‌ద‌ని అభిమానులు పేర్కొంటున్నారు. అయితే త‌ను చేసుకోబోయే అమ్మాయిని కూడా ప్రేమించి పెల్లిచేసుకుంటున్నాడ‌నే నిజ‌మ‌ని అభిమానులు తెలియ‌జేస్తున్నారు. బ‌హుశా ఉగాది పండ‌గ‌నాడు మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయ‌ని తెలుస్తోంది.