శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీ.వీ.
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (19:10 IST)

వయసు మీద పడ్డ గ్లామర్ కు సై అంటున్న టబు!

tabu latest
tabu latest
ఖుఫియా అనేది విశాల్ భరద్వాజ్ రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన 2023 హిందీ-భాషా స్పై థ్రిల్లర్ చిత్రం. నెట్ ఫ్లిక్ లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం అమర్ భూషణ్ రచించిన ఎస్కేప్ టు నోవేర్ అనే గూఢచర్య నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో టబు, అలీ ఫజల్ మరియు వామికా గబ్బి నటించారు. ఈ చిత్రం 5 అక్టోబర్ 2023న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇది ఆదరంపొందుతోంది. అయితే ఇందులో కాస్త బోల్డ్ గా కనిపించింది.

లేటెస్ట్ గా ఓ ఫోటో పోస్ట్ చేసి ఇలా దర్శనమిచ్చింది. ప్రతి పాత్రలో ప్రేమించడం ఒక లక్ష్యం అయితే, అది ఖచ్చితంగా సులభమైనది అని పోస్ట్ చేసింది. తనకు యాక్షన్ అంటే ఇష్టం. వయసు మీద పడ్డ గ్లామర్ గా ఉండటంలో తప్పు లేదు అంటూ తన పోస్ట్ ది చెపుతోంది.

ఇంతకూ ముందు అజయ్ దేవగన్ తో మూడు సినిమాలు చేసింది. అజయ్ నటుడిగానే కాకుండా, దర్శకుడు గా తన కెంతో ఇష్టమని తెలిపింది. భోలా చిత్రం అజయ్ తో చేసింది.