మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (18:04 IST)

''Irreplaceable'' అని టాటూ వేయించుకున్న రష్మిక..?

రక్షిత్-రష్మికల బ్రేకప్‌లో చాలామంది రష్మికనే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ జంట ఎందుకు విడిపోయిందనే విషయంపై స్పష్టత ఇవ్వనప్పటికీ అభిమానులు మాత్రం తప్పు రష్మికదే అన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్

రక్షిత్-రష్మికల బ్రేకప్‌లో చాలామంది రష్మికనే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ జంట ఎందుకు విడిపోయిందనే విషయంపై స్పష్టత ఇవ్వనప్పటికీ అభిమానులు మాత్రం తప్పు రష్మికదే అన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా రష్మిక వేసుకున్న టాటూ.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ టాటూ ఏంటంటే..? ''Irreplaceable'' అనేది. దీనికి భర్తీ చేయలేని స్థానమని అర్థం. 
 
ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక ఆ తరువాత నటించిన 'గీత గోవిందం' సినిమాతో టాప్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగిపోయింది. త్వరలో నాని సరసన నటించిన దేవదాస్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం 'దేవదాస్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రష్మిక తన అందంతో అక్కడున్న వారిని మెస్మరైజ్ చేసింది. 
 
Irreplaceable అని రష్మిక చేతికి టాటూ వేసుకుంది. ఈ టాటూ  రష్మిక-రక్షిత్ కలిసి 'కిరిక్ పార్టీ' సినిమా చేసే సమయంలో కూడా ఉంది. మరి రక్షిత్‌తో ప్రేమాయణానికి ముందే రష్మిక వేయించుకుందా.. లేకుంటే రక్షిత్‌తో స్నేహం తర్వాత వేయించుకుందా అనే విషయంపై క్లారిటీ లేదు.