1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (12:31 IST)

విశ్వ‌క్ సేన్‌తో నివేదా పేతురాజుతో ప్రేమాయణం.. నిజమేనా?

Vishvak sen
Vishvak sen
"ఈ నగరానికి ఏమైంది" సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. యంగ్ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌డ‌నే ప్ర‌చారం న‌డుస్తోంది. విశ్వ‌క్ సేన్‌తో పాగల్ సినిమాలో నటించిన నివేదా పేతురాజు మళ్ళీ విశ్వక్ సేన్ దర్శకత్వంలో వస్తున్న దాస్ కా ధమ్కీ సినిమాలో నటించింది. 
 
ఈ చిత్రంలో  వీరిద్దరి కెమిస్ట్రీ చూస్తుంటే ఇద్దరి మధ్య సంథింగ్ అనేలా చెప్పుకుంటున్నారు. అంతేగాకుండా విశ్వక్ ఇక విశ్వక్ సేన్ ప్రేమలో పడ్డాడని ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. 
 
అలాగే బోల్డ్ సన్నివేశాల్లో నివేదా పేతురాజ్ చాలా సులభంగా నటించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది. దాస్ కా ధమ్కీ నుంచి ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ ద‌క్కింది.