నిర్మాతలకు పగటిపూటే చుక్కలు చూపిస్తున్న హీరోయిన్!! (video)
కొందరు హీరోయిన్లు సినిమా అవకాశం వస్తే చాలురా బాబూ అని అనుకుంటారు. మరికొందరు సినిమా అవకాశాలు ఇచ్చిన నిర్మాతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తుంటారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రూటేలా ఒకరు. ఈమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.
డెబ్యూట్ డైరెక్టర్ రూపొందిస్తున్న బ్లాక్ రోజ్ అనే వెబ్ సిరీస్‌లో నటించనుంది. దీన్ని డైరక్టర్ సంపత్ నంది నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఊర్వశి ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్‌లో 10 రోజులు షూటింగ్‌లో పాల్గొందట. ఆ తర్వాత ముంబైకి తిరగెళ్లిపోయిందట.
అదేసమయంలో కోవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలకు ఖర్చులు తగ్గించుకోవడం అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులోభాగంగా ఈ వెబ్ సిరీస్ నిర్మాతలు కూడా పొదుపు మంత్రం పాటించసాగారు.
ఇందులోభాగంగా, ఊర్వశి ఉండేందుకు వీలుగా ఓ లగ్జరీ సర్వీస్ అపార్టుమెంట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఊర్వశి మాత్రం తనకు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉన్న నోవాటెల్ హోటల్‌లో మాత్రమే బస చేసేలా ఏర్పాట్లు చేయాలని తెగేసి చెప్పిందట.
అంతేకాదు హోటల్ నుంచి షూటింగ్ స్పాట్ వెళ్లేందుకు బెంజ్ లగ్జరీ కారును ప్రతీ రోజు అరేంజ్ చేయాలని కోరినట్టు చర్చ నడుస్తోంది. ఈ విషయాలన్నీ గమనిస్తే ఊర్వశి రూటేలా మాత్రం నిర్మాతలకు విపత్కర పరిస్థితుల్లో చుక్కలు చూపిస్తుందని చెప్పక తప్పదు.