శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 12 అక్టోబరు 2019 (16:40 IST)

శేఖర్ కమ్ములకు ఏమైంది.. ఆ సమస్యతో బాధపడుతున్నారా?

సహజ దర్శకుడు శేఖర్ కమ్ముల. అన్ని వర్గాల ప్రేక్షకులను దగ్గర చేసే సినిమాలు చేయడం శేఖర్ కమ్ములకు మాత్రమే తెలుసు. ఇది తెలుగు సినీపరిశ్రమలో ఎవరైనా ఠక్కున చెబుతారు. అయితే ఫిదా సినిమా తరువాత శేఖర్ కమ్ముల కాస్త గ్యాప్ ఇచ్చి నాగ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 
 
ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్. నాగచైతన్య సరసన నటిస్తుండటంతో అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అన్న ఆసక్తిలో ఉన్నారు. అయితే సినిమాను శేఖర్ కమ్ముల డిసెంబర్‌లో రిలీజ్ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. షూటింగ్ మొత్తం విదేశాల్లో వేగంగా జరుగుతోంది.
 
కానీ గత వారంరోజుల నుంచి శేఖర్ కమ్ముల వైరల్ ఫీవర్‌తో తీవ్రంగా బాధపడుతున్నారట. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని మళ్ళీ షూటింగ్‌కు వచ్చినా ఆయన దానిపై దృష్టి పెట్టలేకపోతున్నారట. దీంతో సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సినిమాను వచ్చే సంవత్సరం జనవరి నెలలోనే విడుదల చేసేందుకు కూడా సినిమా యూనిట్ సిద్థమవుతోందని తెలుస్తోంది.