బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (11:44 IST)

#Agnyaathavaasi Song : 'గాలి వాలుగా ఓ గులాబి వాలి గాయమైనదీ..'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రంలోని రెండో పాట ఆడియోను మంగళవారం రిలీజ్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రంలోని రెండో పాట ఆడియోను మంగళవారం రిలీజ్ చేశారు. ఇందులో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత బాణీలు సమకూర్చారు.
 
'గాలి వాలుగా ఓ గులాబి వాలి గాయమైనదీ..' అంటూ సాగిపోతున్న ఈ పాటను అనిరుద్ రవిచందర్ ఆలకించారు. 4 నిమిషాల 18 సెకనుల నిడివితో అనిరుద్ రవిచందర్ అందించిన లిరిక్స్‌తో ఈ పాట ఆకట్టుకుంటోంది. భారీ అంచనాల నడుమ 'అజ్ఞాతవాసి' జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
కాగా, ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇప్పటికే 'బయటకొచ్చి చూస్తే టైమేమో..' అనే మొదటి పాటను రిలీజ్ చేయగా, ఈ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా సినిమాలోని రెండో పాటను కూడా విడుదల చేశారు.