శనివారం, 22 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 22 నవంబరు 2025 (17:33 IST)

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Roshan, Anaswara Rajan
Roshan, Anaswara Rajan
రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా'ఛాంపియన్'తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథల ఎంపికలో, ప్రతిసారీ బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో స్వప్న సినిమాస్ వెరీ స్పెషల్.
 
ఫస్ట్-లుక్ పోస్టర్లు, టీజర్‌తో సంచలనం సృష్టించిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు క్యారెక్టర్ బేస్డ్  గ్లింప్స్ ద్వారా సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. టీజర్ ప్రేక్షకులను మైఖేల్ సి విలియమ్స్ వరల్డ్ ని  పరిచయం చేయగా, ఫస్ట్ సింగిల్- గిర గిర గింగిరాగిరే  ప్రోమో అనస్వర రాజన్ పోషించిన చంద్రకళని అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
 
గ్లింప్స్‌లో చంద్రకళని ఓ ధైర్యసాహసాలున్న పల్లెటూరి అమ్మాయిగా పరిచయం చేశారు. తన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచం కంటే పెద్ద కలలు కంటూ, మంచి నాటక కళాకారిణిగా ఎదిగి, ఒక రోజు తనకంటూ స్వంత నాటక బృందాన్ని స్థాపించాలనే ఆశతో ముందుకు సాగే అమ్మాయి చంద్రకళ .
 
అనస్వర రాజన్ పాత్రను ఎంతో అందంగా మలిచారు. ఆమె పాత్ర ఎంత కీలకమో సన్నివేశాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. రోషన్–అనస్వరల కెమిస్ట్రీ ఈ గ్లింప్స్ లో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి ప్రేమకథ ‘చాంపియన్’లో మనసుని తాకేలా ఉండబోతుంది.
 
మిక్కీ జె మేయర్ కంపోజ్ చేసిన ఆహ్లాదకరమైన మెలోడీ కట్టిపడేసింది. రామ్ మిరియాల వాయిస్ మెస్మరైజింగ్ గా వుంది. పూర్తి లిరికల్ సాంగ్ నవంబర్ 25న విడుదల కానుంది.
 
ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ ఆర్. మధీ వండర్ ఫుల్ విజువల్ క్యాప్చర్ చేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
ఛాంపియన్ డిసెంబర్ 25న క్రిస్మస్‌కు విడుదల కానుంది.